లఖింపూర్ ఖేరీ అల్లర్ల కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీనిపై భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ స్పందించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రైతులకు న్యాయం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడు బాధిత రైతులకు యూపీ ప్రభుత్వం భద్రత కల్పించాలన్నారు. వారికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలన్నారు. వారి కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి కుమారుడు ఆశిష్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందనే ఆశ రైతుల్లో ఇప్పుడు నెలకొందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
అశీశ్ బెయిల్ ను సుప్రీం కోర్టు సోమవారం రద్దు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ మేరకు సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. వారంలోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆశీశ్ కు సుప్రీం కోర్టు సూచించింది.