సాగు చట్టాలకు వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో తమ నిరసనను తెలిపిన అన్నదాతలు.. ఇప్పుడు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.. ఈనెల 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దేశవ్యాప్తంగా రైల్ రోకోను చేపట్టనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ రైల్ రోకో ఆందోళన్‌లో పాల్గొనాలని కోరింది.
రైల్ రోకోపై కేంద్రం అప్పుడే ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్‌లో రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కంపెనీలను రంగంలోకి దింపింది. కాగా నిరసనకారులు సంయమనంతో వ్యవహరించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైతులను కోరింది. నిబంధనలు అతిక్రమిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది.