కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 43రోజులుగా రైతన్నలు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమైంది. కేంద్రంతో ఏడు దఫాలుగా జరిపిన చర్చల్లో ఏమాత్రం ఫలితం లేకపోవటంతో అన్నదాతలు ఆందోళనలను మరింత పెంచాలని నిర్ణయించారు.
అందులో భాగంగా ఢిల్లీకి వచ్చే నాలుగు ముఖ్యమైన హైవేలపై ట్రాక్టర్ ర్యాలీలకు పిలుపునిచ్చారు. దీంతో రైతన్నలు ట్రాక్టర్లతో భారీగా సరిహద్దులకు చేరుకుంటున్నారు. బుధవారం వర్షం కారణంగా రద్దైన ట్రాక్టర్ల ర్యాలీని గురువారం నిర్వహిస్తున్నారు. దీక్షా స్థలి నుంచి కుండ్లి-మనేసర్-పల్వాల్ వరకు వాహనాల ప్రదర్శన కొనసాగనుంది.
Protesting farmers to hold tractor rally today at four borders of Delhi including Eastern and Western peripheral expressways.
Visuals from Ghazipur border pic.twitter.com/1gmKMhHE4T
— ANI (@ANI) January 7, 2021