రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఎర్రకోటకు చేరింది. పోలీసుల ఆంక్షలను చేధించుకుంటూ, టియర్ గ్యాస్ వాయుగోళాలకు వెన్నుచూపకుండా, వేలాది పోలీసులను చేధించుకొని రైతులు ఎర్రకోటపై త్రివర్ణ జెండాతో తమ నిరసన గళాన్ని వినిపించారు. త్రివిధ దళాలకు పోటీగా అన్నట్లుగా రైతుల కవాతు సాగింది.
ఢిల్లీకి చేరే రోడ్లు మాత్రమే కాదు… ఢిల్లీలోని ప్రధాన రహాదారులన్నీ రైతులతో నిండిపోయాయి. సెంట్రల్ ఢిల్లీలోకి రైతులు చొచ్చుకొని రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతుల ఉద్యమం హింసాత్మకంగా మారకుండా చూడాలని రైతు నాయకులకుక పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంయమనం పాటించాలని, ఏమాత్రం తేడా వచ్చిన రణరంగంగా మారుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక రైతుల ఆందోళనల నేపథ్యంలో మెట్రో స్టేషన్లీ మూసివేశారు. మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.