కామారెడ్డి జిల్లాలో అన్నదాత ఆగ్రహించాడు. వరి ధాన్యం తూకంలో అధికంగా తరుగు తీస్తుండడంపై నిరసనకు దిగారు పాల్వంచ రైతులు. సిరిసిల్ల-కామారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
క్వింటాలుకు 12 కిలోల తరుగు తీస్తున్నారని మండిపడ్డారు అన్నదాతలు. రైతుల ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.