బాలీవుడ్ హీరోయిన్ జాన్వికపూర్ కు నిరసన సెగ తగిలింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో గుడ్ లక్ జెర్రీ అనే సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ నిమిత్తం జాన్వికపూర్ జనవరి 11న పంజాబ్ ఫతేఘర్ సాహిబ్ లోని బస్సీ హఠాణాకు కు వెళ్ళింది.
కాగా ఆమెను అక్కడ కొంత మంది రైతులు అడ్డుకున్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు గాను రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అందుకు గాను జాన్వికపూర్ అంగీకరించడంతో కాసేపటి తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు.