బెల్లా హడిడ్… ఫేమస్ మోడల్. ఈవెంట్స్, ఫంక్షన్స్ ఇలా సందర్భమేదైనా దానికి అనుగుణంగా దుస్తులను ఎంపిక చేసుకుంటారు. తనదైన డ్రెసింగ్ స్టైల్ తో ఎప్పటికప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటు ఉంటారు.
ఇక నటి దీపికా పదుకుణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త రకం ఫ్యాషన్ దుస్తులను ధరించడంలో దీపిక తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఆమె ఫ్యాషన్ చాయిస్ ను అందరూ అభినందిస్తూ ఉంటారు.
2017లో మోడల్ బెల్లా హడిడ్ తన పుట్టిన రోజు నాడు డాల్సే అండ్ గబ్బనా బ్లాక్ శాటిన్ డ్రెస్ లో మెరిసిపోయారు. మోకాళ్ల వరకు ఉన్న డ్రెస్ లో ఆమె హాట్ గా కనిపించారు. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు.
ఇక 2022లో ఫర్హన్ అక్తర్, షిబానీల వివాహానికి బాలివుడ్ నటి దీపికా పదుకుణే హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె సేమ్ హడిడ్ లాంటి డ్రెస్ నే ఆమె వేసుకున్నారు. బ్లాక్ డ్రెస్ లో హాట్ గా కనిపించిన ఆమెపై అందరి కళ్లు ఆమె మీదనే పడ్డాయి.
Advertisements
తాజాగా ఇప్పుడు ఆ ఇద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సేమ్ డ్రెస్ లో ఉన్న ఆ ఇద్దరి ఫోటోలను పక్క పక్కన నెటిజన్లు పెట్టి కామెంట్లు చేస్తున్నారు. ఆ డ్రెస్సులో ఎవరు ఎంత ఉందంగా ఉన్నారో అభివర్ణిస్తూ అభిమానులు మురిసిపోతున్నారు.