అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతమైంది. తాజాగా అంతరిక్షం నుంచి వచ్చిన రేడియో సిగ్నల్‌ను ఖగోళ శాస్త్రజ్జులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇలాంటి సిగ్నల్ గతంలో ఒక్క సారి మాత్రమే వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దాదాపు 3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నుండి ఈ సిగ్నల్ వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కొత్త ఫాస్ట్ రేడియో బర్స్ట్‌కు ఎఫ్ఆర్బీ 20190520బీ అని నామకరణం చేశారు.
దీనికి సంబంధించిన వివరాలను పరిశోధకులు తమ సైంటిఫిక్ జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ఈ ఎఫ్ఆర్బీ మరుగుజ్జు గెలాక్సీ నుంచి ఉద్భవించిందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ గెలాక్సీ సామూహిక ద్రవ్యరాశి మన పాలపుంత ద్రవ్యరాశిలో 2,500వ వంతు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటి ఎఫ్ఆర్బీని 2019లో చైనాలోని గుయిజౌ ప్రావిన్సులో ఉన్న టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. ఇది 30 ఫుట్ బాల్ మైదానాలకు సమానమైన సిగ్నల్-రిసీవింగ్ ప్రాంతాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించారు.