జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెంబర్తి సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాల ప్రకారం.. డీసీఎం టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో డీసీఎం వాహనం డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆరేళ్ల చిన్నారి కూడా దుర్మణం చెందింది. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇక, మృతులు, గాయపడినవారి వివరాలు తెలియాల్సి ఉంది.