బావిలో పడ్డ ఆవును కాపాడబోయి తండ్రీ కొడుకులు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఉదయం ఆవును మెపేందుకు వ్యవసాయ భూమికి తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆవు చెరువులో పడిపోయింది. దాన్ని కాపాడేందుకు మధుకర్ చెరువులోకి దిగాడు. చెరువులో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో మధుకర్ కు ఊపిరి ఆడటం లేదని గ్రహించిన మధుకర్ తండ్రి కొడుకును కాపాడే ప్రయత్నంలో ఇద్దరూ నీటమునిగి మరణించారు.
ఆవు కోసం తండ్రీ కొడుకుల మృతితో వారి సొంత గ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో విషాధ చాయలు అలుముకున్నాయి.