తమకు చెందాల్సిన భూమి విషయం ఎటూ తేలటం లేదని, తమకు న్యాయం చేస్తానని డబ్బులు తీసుకున్న వీఆర్వో పని చేయక ఇబ్బందిపెడుతున్నాడన్న కారణంతో ఇద్దరు రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహాత్యాయత్నానికి ప్రయత్నించారు.
నారాయణపేట కలెక్టర్ కార్యాలయం ముందు నాగప్ప, రాజు అనే తండ్రి కొడుకులు పురుగుల మందు తాగటం కలకలం రేపింది. రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడున్న వారు ఆసుపత్రికి తీసుకెళ్లారు.