డబ్బుకోసం కన్నా తండ్రే బిడ్డను కిడ్నాప్ చేసిన సంఘటన గుంటూరు జిల్లా చోటుచేసుకుంది. తాడేపల్లి లోని అమర్ రెడ్డి కాలనీ పార్థసారథి అనే ఆరు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. 5 లక్షల రూపాయలు డబ్బులిస్తేనే బాలుని అప్పగిస్తామని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు లో తల్లి పేర్కొంది. అంతే కాకుండా శ్యాముల్ అనే వ్యక్తి తో పాటు తండ్రి శ్రీనివాసరావు కలిసి డబ్బు కోసం పధకం ప్రకారం కిడ్నాప్ చేసినట్లు ఆ తల్లి తెలిపింది.
బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి తండ్రి, నిందితుడు సోదరుడు అబ్రహంను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కు గురైన బాలుడుతో నిందుతుడు గుంటూరు పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు సమాచారంతో ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపడుతున్నారు.