హైదరాబాద్ కూకట్‌పల్లిలో కన్న తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడి బాలుడు చరణ్ (12) మృతి చెందాడు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన బాలు.. కుటుంబంతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్నాడు. ఆరో తరగతి చదువుతున్న తన కుమారుడు చరణ్.. ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకావడం లేదని, సరిగా చదవడం లేదంటూ ఈ నెల 18న బాలుడిపై దుశ్చర్యకు పాల్పడ్డాడు. పెయింటింగ్ కోసం వడే టర్పంటాయిల్‌ను బాలుడిపై పోసి నిప్పంటించాడు. బాధను తట్టుకోలేక పరుగులు తీస్తూ.. అక్కడే ఉన్న గోతిలో పడ్డాడు. స్థానికులు అది గమనించి అతన్ని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.
మూడు రోజులుగా చికిత్స పొందుతూ చరణ్ మృతిచెందాడు. బాలుడి తండ్రిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు పోలీసులు.