యూపీలో దారుణం చోటు చేసుకుంది. చందాపూర్‌లో ఓ మహిళపై ఆమె భర్త, అతని తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.
ఈ కేసులో నిందితులకు బదోహిలోని ప్రత్యేక న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడి తండ్రికి 14 సంవత్సరాలు, నిందితుడికి పదేండ్ల జైలు శిక్షను విధిస్తు న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ఎస్పీ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… చందపూర్ కు చెందిన మహిళ(30) ఆమె భర్త చంద్ర రాజ్(35), ఆమె మామ అమర్ నాథ్(60) అత్యాచారానికి పాల్పడ్డారు.
దీంతో మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో వారిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.