సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది సహజం. ప్రతి హీరో కూడా తన కొడుకుని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి కూడా నటిస్తూ ఉంటారు. అయితే అలా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తున్నప్పుడు ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. సినీ ప్రేక్షకులు కూడా ఆ సినిమాను చూసేందుకు క్యూ కడుతూ ఉంటారు.
మన ఇండస్ట్రీలో చూసుకుంటే ఎన్టీఆర్ – బాలకృష్ణ ,ఎన్టీఆర్ – హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు – నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ – రమేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ – మహేష్ బాబు, చరణ్ – చిరంజీవి, నాగార్జున – నాగచైతన్య ఇలా చాలా మంది తండ్రీకొడుకులు ఉన్నారు. అలా తండ్రి కొడుకులు నటించిన ప్రతీ సినిమాపై కూడా భారీ హైప్ ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే పర్వాలేదు. కానీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కష్టమే. కానీ తండ్రి కొడుకులను ఒకే సినిమాలో చూపించటం అంత చిన్న విషయం కాదు. తేడా వస్తే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎన్టీఆర్, చిరు లే కాదు అక్కినేని కూడా సాధించిన ఈ 7 ఇండస్ట్రీ హిట్ సినిమాల గురించి మీకు తెలుసా ?
ఇలా చాలా మంది డైరెక్టర్లు ఆ విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక టాలీవుడ్ లో తండ్రి కొడుకులు కాంబినేషన్ లో వచ్చి ఫ్లాప్ గా నిలిచిన చిత్రాలు చూసుకుంటే… మొదటిగా సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన అక్బర్ సలీం అనార్కలి, సింహం నవ్వింది వంటి చిత్రాలు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఏఎన్ఆర్, నాగార్జున కాంబినేషన్ లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. కానీ అగ్నిపుత్రుడు, ఇద్దరూ ఇద్దరే సినిమాలు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నాయి.
ఇక మహేష్ బాబు ,కృష్ణ విషయానికొస్తే ఈ ఇద్దరూ చాలా సినిమాల్లో నటించారు. అందులో వంశీ, టక్కరి దొంగ సినిమాలు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నాయి. మంచు విష్ణు, మంచు మోహన్ బాబు కాంబినేషన్ లో కూడా ప్రేక్షకుల ముందుకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే అందులో గేమ్, గాయత్రి సినిమాలు థియేటర్ వద్ద ఫెయిల్ అయ్యాయి. అలాగే మోహన్ బాబు, మంచు మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం ప్లాప్ అయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు విజయానికి వేస్తే… ఆయన కుమారుడు గౌతమ్ తో తీసిన 1 నేనొక్కడినే సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినప్పటికీ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. మరొక హీరో ఆది సాయి కుమార్… ఆది సాయి కుమార్ కూడా తండ్రి సాయికుమార్ తో కలిసి చుట్టాలబ్బాయి సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది.
మహేష్ అతడు సినిమాను ఉదయ్ కిరణ్ ఎందుకు వదులుకున్నాడో తెలుసా ?
మరో నటుడు బ్రహ్మానందం… బ్రహ్మానందం కొడుకు గౌతమ్ కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన పల్లకిలో పెళ్లికూతురు సినిమా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అలాగే కృష్ణంరాజు, ప్రభాస్ విషయానికి వస్తే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి రెబల్ రెండు రాధే శ్యామ్. ఈ రెండు చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
ఆఖరిగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో బ్రూస్ లీ, ఆచార్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా ఫ్లాప్ గా నిలవడం గమనించదగ్గ విషయం.