ఫాతిమా సనా… ఈ పేరు కన్నా దంగల్ గీతా పొగాట్ అంటే గుర్తు పడతారామే. ఆ మూవీ ఆమెకు అంత క్రేజ్ తీసుకొచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా 1997లో మొదలైంది ఫాతిమా సినీ ప్రయాణం. తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే.. 2016లో వచ్చిన దంగల్ మూవీ మంచి పేరు తీసుకొచ్చింది.
దంగల్ లో ఫాతిమా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో కత్తి పోరాటాలు చేసి కూడా మెప్పించింది. చేస్తోంది ఏడాది ఒక సినిమానే అయినా.. తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోంది. అయితే.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోషూట్ లు సినిమా కబుర్లను వివరిస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది.
తాజాగా లైట్ బ్లూ కలర్ డ్రస్ లో మెరిసిన ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అవికాస్తా వైరల్ అవుతున్నాయి. అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘ఎంత చక్కగున్నావే’ అంటూ రంగస్థలం సాంగ్ పాడేసుకుంటున్నారు. ఇటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో క్లోజ్ గా ఉంటోందని తరచూ ఈమె గురించి గాసిప్స్ వినిపిస్తుంటాయి.
అన్నట్టు.. ఫాతిమా ఓ తెలుగు సినిమా కూడా చేసిందండోయ్. అది హిట్ అయి ఉంటే అందరికీ తెలిసేదేమో. దంగల్ మూవీ కంటే ముందు 2015లో ‘నువ్వు నేను ఒక్కటవుదాం’ అనే తెలుగు సినిమా చేసింది. ప్రస్తుతం ఇది యూట్యూబ్ లో ఉంది.