సెకండ్ ఇన్నింగ్స్‌లో అయితే యాంగ్రీమెన్, లేదా సెంటిమెంట్ కలగలిప పాత్రలే చేసుకుంటూ వస్తున్న జగపతిబాబు.. ఈ సారి కాస్త రూట్ మార్చి చేస్తున్న సినిమా FCUK(ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్). స్వయంగా ఆయన లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన పాత్రలను ఇటీవల ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను బయటకు వదిలారు. దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
Such sweet & happy trialer, https://t.co/6z9eL8jLNX
Checked out guys 🙂#FatherChittiUmaaKaarthik
Wishing
@IamJagguBhai @MrKarthiKKG@Ammu_Abhirami #Saharshitha
Dir VidyasagarRaju &@damukanuri all the very best with it 🙂#FCUKmovie pic.twitter.com/WrfVQlMNGU— Sundeep Kishan (@sundeepkishan) January 1, 2021
కొత్తగా డైరెక్టర్ విద్యాసాగర్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌ని చూస్తోంటే సినిమా మొత్తం నాలుగు పాత్రల చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. అమ్మాయిలను ఫ్లట్‌చేసే పాత్రలో జగపతి బాబు ఇందులో కనిపిస్తారని అర్థమవుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై కేఎల్ దామోదర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.