నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెస్తున్నా.. పోలీసులు కఠిన శిక్షలు అంటున్నా.. మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
రంగారెడ్డి జిల్లా పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వివాహితను కిడ్నాప్ చేసి కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
కారులో ప్రయాణిస్తూనే మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బాధితురాలి వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకొని వదిలి వెళ్లినట్లు సమాచారం.
ఘటన తర్వాత నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది బాధితురాలు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దోపిడీ దొంగల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.