యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కృష్ణంరాజు పరమహంస గా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోటమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచాయి.
సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు మార్చి11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ఫై దృష్టి పెట్టారు. ప్రేమికుల దినోత్సం సందర్భంగా ఫిబ్రవరి 14న ఓ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. నైట్ థీమ్ పార్టీ పేరుతో ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.
హైదరాబాద్‌లోని కెమిస్ట్రీ క్లబ్‌లో ప్రత్యేకంగా సెట్ వేసి ఈ ఈవెంట్ నిర్వహించనున్నారట. ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఈ సెట్ ఉండబోతుందట.
సౌత్ ఇండియాలోనే ఇలాంటి తొలిసారి ఈ థీమ్ పార్టీ జారబోతుందట. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ అంతా కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.