పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజుల పెంపు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న జీవోలు జారీ చేశారు. దీనిపై కొందరు విద్యార్థులు టీఏఎఫ్ఆర్సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులు పెంచిందంటూ పిటిషన్ ఫిటిషన్ దాఖలు చేశారు.
దీంతో పిటిషన్ విచారించిన హైకోర్టు పీజీ వైద్య ఫీజుల పెంపుపై సీజే ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 2016-2019కి టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ ఫీజులతో విద్యార్థులపై భారం వేయొద్దని కోర్ట్ ఆదేశించింది.
విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే 30 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది కోర్ట్. కోర్సు పూర్తి చేసిన పీజీ వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా వెంటనే ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో వైద్య పీజీ విద్యార్థులకు ఊరట లభించినట్లయింది.
కోర్సు పూర్తయి నాలుగేళ్లు గడిచినా సర్టిఫికేట్లు రాక కొందరూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజా కోర్టు తీర్పుతో వారికి కొంత మేర లాభం చేకూరుతుంది. తమకు అనుగుణంగా కోర్ట్ తీర్పు రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.