గుజరాత్ లో తనకు ఘన స్వాగతం లభించడంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
‘ నాకు ఘన స్వాగతం పలికిన ప్రధాని మోడీ, భారత ప్రజలకు దన్యవాదాలు. నేను భారత్ కు రాగానే సచిన్ లాగా ఫీల్ అయ్యాను. గుజరాత్ అంతటా నా కటౌట్లను చూసినప్పుడు అమితాబ్ లాగా ఫీల్ అయ్యాను’ అని అన్నారు.
ప్రధాని మోడీని ఆయన ఖాస్ దోస్త్(ప్రత్యేకమైన స్నేహితుడు)అని సంభోదించారు. ‘ నా స్నేహితుడు మోడీజీకి ధన్యవాదాలు. ఆయనకు ఖాస్ దోస్త్(ప్రత్యేకమైన స్నేహితుడు) అనే పదాన్ని ఉపయోగించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు.
అంతకు ముందు గుజరాత్ ప్రజలు తనకు అద్భుతమైన స్వాగతాన్ని పలికారని బ్రిటన్ ప్రధాని అన్నారు. అలాంటి ఘనస్వాగతాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నారు. తనకు ప్రపంచంలో మరెక్కడా ఇంత ఆదరణ లభించదన్నారు. మొదటిసారిగా మీ (ప్రధాని మోడీ) సొంత రాష్ట్రాన్ని చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు.
రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఒక రోజు క్రితం ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలిపారు.