ప్రస్తుతం శాంతిమంత్రం జపిస్తున్నారు తాలిబన్లు. ఓవైపు భయంతో జనం పరుగులు పెడుతుంటే.. ఇంకోవైపు గతంలోలాగే తమ పనులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు తమపై నమ్మకం కలిగే చర్యలు చేపట్టారు. తాలిబన్ ప్రతినిధి మౌలావి అబ్దుల్ హేమద్ ఓ లేడీ యాంకర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
కాబూల్ లో తనిఖీలు, సాధారణ పరిస్థితిపై ప్రశ్నలు అడగ్గా.. అతను పలు విషయాలు ప్రస్తావించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. తాలిబాన్లు దేశానికి నిజమైన పాలకులు అని ప్రపంచం మొత్తం ఇప్పుడు గుర్తించిందన్నాడు హేమద్. ప్రజలు ఇప్పటికీ తాలిబాన్ల పట్ల భయపడుతుండడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చాడు. దాదాపు 17 నిమిషాలపాటు ఈ ఇంటర్వ్యూ కొనసాగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Our female presenter is interviewing a Taliban media team member live in our studio @TOLOnews #Afghanistan pic.twitter.com/G6qq1KWKOH
— Miraqa Popal (@MiraqaPopal) August 17, 2021
Advertisements