రవిప్రకాశ్ అక్రమ అరెస్టు వ్యవహారంలో న్యాయనిపుణులు, ఈ కేసును పరిశీలిస్తున్న కొంతమంది జర్నలిస్టులు కొన్ని సందేహాలను లేవనెత్తారు. వీటికి టీవీనైన్ సంస్థ కొత్త యాజమాన్యం, పోలీసులు, లేదా ఈ కేసును తెరవెనుక వుండి నడిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని నిలదీస్తున్నారు. వారు లేవనెత్తిన సందేహాలు ఇవే…
1. ఒక దశాబ్దానికి పైగా టీవీ 9 గ్రూప్ తన సంస్థలో ఉద్యోగులకు బోనస్ చెల్లిస్తోంది. (ABCL బ్యాలెన్స్ షీట్లు, రిటర్న్‌లలో దీనికి సంబంధించిన సాక్షాలను చూడవచ్చు)
2. 2014లో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం టీవీ9పై తెలంగాణలో నిషేధం విధించినప్పుడు మాత్రమే ఈ సంస్థలో ఏ ఉద్యోగికీ బోన్ ఇవ్వడం సాధ్యపడలేదు.
3. 2018-2019లో కూడా దేశవ్యాప్తంగా వున్న టీవీ9 గ్రూపులోని సంస్థ ఉద్యోగులందరికీ బోనస్ ఇచ్చారు. ఒకవేళ రవిప్రకాష్ చేసింది మోసమే అయితే వారు ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన బోనస్‌ను ఉద్యోగులందరి నుంచి తిరిగి తీసుకుంటారా?
4. క్లిఫోర్డ్ పెరియెరా ఇప్పటికీ ABCL బోర్డులో ఎందుకు ఉన్నారు.? సంవత్సర కాలంగా తన ఖాతాలో జమ చేసిన డబ్బు గురించి తనకు తెలియదని మాత్రం చెప్పకండి (అతనికి వైస్ ప్రెసిడెంట్ మూర్తి కంటే ఎక్కువ బోనస్ వచ్చింది)
5. 2018 సెప్టెంబర్ నుంచి మూడు విడతలుగా బోనస్ చెల్లింపులు జరిగాయి.
6. ఎన్‌సిఎల్‌టిలో వున్న అలందా మీడియా కేసు ప్రకారం- మే 8, 2019న వారికి MIB అనుమతి లభించింది (టీవీ ఛానెల్‌లోని ఏదైనా బోర్డు సభ్యునికి MIB క్లియరెన్స్ పొందడం తప్పనిసరి)
7. కాబట్టి! ఈ ఏడాది ఏర్పాటు చేసిన బోర్డు నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో తీసుకున్న నిర్ణయాలకు రవిప్రకాష్ ఎలా అనుమతి తీసుకోవాలో చెప్పాలి.?
9. అనేక సంస్థలతో సంబంధాలు వున్న ఈ కొత్త యాజమాన్యం టీవీ9 టేకోవర్ చేసే ముందు అప్పటి వరకు జరిగిన లావాదేవీలపై దృష్టి పెట్టలేదని అనుకోగలమా?
10. సరే, ఇప్పటి ఫిర్యాదు విషయానికి వస్తే, అసలీ ఫిర్యాదు మీద సంతకమే లేదు. పైగా, ఇది సెప్టెంబర్ 4 నాటిది.
11. సెప్టెంబర్ 24 న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మోసం గురించి వారికి అకస్మాత్తుగా తెలిసిందని ప్రస్తావించారు. కానీ, సెప్టెంబర్4 వ తేదీనే వారు దాని గురించి ఎలా కేసు పెట్టారు ? కాలజ్ఞానం ఏదైనా వుందా?
12. ACPని ఈ విషయం గురించే ప్రస్తావించినప్పుడు, అతను ‘క్షమించండి, ఆ తేదీ వాస్తవానికి 4 అక్టోబర్ 2019, సాయంత్రం 6 గంటలు’ అని వివరణ ఇచ్చాడు.
13. ఒకవేళ అలా అనుకున్నప్పటికీ, అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు వారు ఫిర్యాదు చేస్తే, 5 అక్టోబర్ 11 ఉదయం వేళ పోలీసులు రవిప్రకాశ్‌ను అరెస్టు చేశారు. అంటే, 18 గంటలలోపే ఈ ఆర్థిక మోసంపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేశారని మనం అర్ధం చేసుకోవాలన్న మాట! (అంటే 18 గంటల్లోపే వారు బ్యాంకు స్టేట్‌మెంట్స్ అన్నీ పరిశీలించుకోవడం పూర్తిచేసుకోగలిగారా? 10 సంవత్సరాల బ్యాంకు రికార్డులు 18 గంటల్లో పోలీసులు ఎలా పరిశీలించుకుని దర్యాప్తు పూర్తిచేయగలిగారు? ఇది ఒక రికార్డు కదా!) టీవీ9లో 2, 3 వేల మందికి పైగా ఉద్యోగులు వున్నారు. వారందరూ ఎన్నిసార్లు బోనస్ అందుకున్నారో పోలీసులు పరిశీలించారా?
14. గౌరవ హైకోర్టు – ఇది ఆర్బిటేషన్, ప్రైవేట్ వ్యవహారం అని పేర్కొంది. లేదా ఇది అతి పెద్ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ నేరం అయినప్పటికీ అది క్రిమినల్ కేసు (SFIO) కాదు. బంజారాహిల్స్ పోలీసులు ‘అంతకు మించి’ పనేదో చేస్తున్నట్టు కనిపిస్తోంది
15. రవిప్రకాశ్ రోజు విడిచి రోజు పోలీస్ స్టేషన్‌కు హాజరవుతున్న వ్యక్తి. ఏదేనీ కంపెనీ కేసులో 21 రోజుల నోటీసు ఇవ్వాలనేది ఒక నిబంధన. అది కూడా ఇక్కడ పాటించలేదు.