దేశంలో ఇటీవల మద్యం వినియోగం తగ్గింది. గత దశాబ్దంతో పోలిస్తే ఈ సారి లిక్కర్ వినియోగం గణనీయంగా తగ్గినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 2019-21 మధ్య ఐదవ జాతీయ కుటుంబ సర్వే(ఎన్ ఎఫ్‌హెచ్ఎస్-5)ను ఇటీవల నిర్వహించారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఎన్ఎఫ్ హెచ్ఎస్ డేటా ప్రకారం…. దేశంలో 2021 నాటికి 15 నుంచి 54 ఏండ్ల మధ్య గల పురుషుల్లో 22.9 శాతం, స్త్రీలలో 0.7శాతం మంది మాత్రమే మద్యం సేవించారు. 2006 నుంచి ప్రస్తుతం వరకు చూస్తే దేశంలో మద్యపానం చేసే భారతీయుల సంఖ్య చాలా వరకు తగ్గింది.
ఎన్ఎఫ్ హెచ్ఎస్ మూడవ సర్వే (2005-06), ఎన్ఎఫ్ హెచ్ఎస్-4 (2015-16) మధ్య కాలంలో మద్యం సేవించే పురుషుల సంఖ్య 32 శాతం నుండి 29 శాతానికి పడిపోయింది. మహిళల విషయంలో ఈ సంఖ్య 2.2 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది.
ఎన్ఎఫ్ హెచ్ఎస్-4 వ, ఎన్ఎఫ్ హెచ్ఎస్-5 వ సర్వే మధ్యలో మద్యం సేవించే పురుషుల సంఖ్య సేవించే పురుషుల నిష్పత్తి 29 నుండి 22 శాతానికి తగ్గింది. ఆశ్చర్యకరంగా ఈ కాలంలో మద్య పానం చేసే మహిళల శాతంలో ఎలాంటి మార్పులు రాలేదు.
ఎన్ఎఫ్ హెచ్ఎస్-5ను 2019-2021 మధ్య నిర్వహించారు. ఈ సమయంలో భారత్ రెండు లాక్ డౌన్లను చూసింది. ఈ సమయంలో కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, మద్యం అందుబాటులో లేకపోవడంతో ఈ సమయంలో మద్యం వినియోగం తగ్గి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.