పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పన్ కొషియం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు . ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఈ చిత్రంలో సాయిపల్లవి నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయం నిజమే అంటూ క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది. మరోవైపు విరాట పర్వం సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు నాని హీరో గా రాబోతున్న శ్యామ్ సింగ రాయ్ లో కూడా నటించనుంది. అంతే కాకుండా గోపీచంద్ హీరో గా రాబోతున్న అలివేలుమంగ వెంకటరమణ సినిమాలో కూడా సాయి పల్లవి నటించబోతున్నారని తెలుస్తోంది.