ఉక్రెయిన్ పై సైనిక దాడులు చేస్తున్న రష్యాకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. ఇప్పటికే అమెరికాతో పాటు.. పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అదే విధంగా రష్యా దుశ్చర్యకు గురి అవుతున్న ఉక్రెయిన్ కు క్రీడాలోకం కూడా మద్దతుగా నిలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో ఖతార్ లో జరిగే ప్రపంచ కప్ కోసం రష్యా పురుషుల జట్టు మార్చిలో క్వాలిఫైయింగ్ ప్లే-ఆఫ్ లలో పోలాండ్ తో రష్యా ఆడాల్సి ఉంది. పోలాండ్ ఫుట్ బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఇంగ్లాండ్ లో జూలైలో జరగనున్న యూరోపియన్ ఛాంపియన్ షిప్ లో రష్యా మహిళల జట్టు ఆడనుంది.
Advertisements
ఫుట్‌బాల్ జట్లపై ఫిఫా, యూఈఎఫ్‌ఏ నిషేధం విధించడం రష్యాకు పెద్ద ఎదరుదెబ్బ తగిలినట్లైంది. అదే విధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. దీంతో రష్యాకు ఎదురు గాలులు వీస్తున్నాయంటున్నారు నిపుణులు.