రోజురోజు కు కరోనా వైరస్ విజృంభిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. తాజాగా మరో 15 పాజిటివ్ కేసులు ఆంధ్రాలో నమోదు అయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటవరకు 19 మందికి పరీక్షలు నిర్వహించగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణ 6, చిత్తూరులో 3 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం 329 పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదు అయ్యాయి.