దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరోసారి 50 వేలకు పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 వేల 972 మంది వైరస్ బారినపడ్డారు. మరో 771 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18 లక్షల 3 వేల 696కు చేరింది. ఇప్పటివరకు 11 లక్షల 86 వేల 203 మంది వైరస్ నుంచి కోలుకోగా..5 లక్షల 79 వేల 357 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 38 వేల 135కు పెరిగింది.
మరోవైపు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య రెండు కోట్లు దాటినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.నిన్న నిర్వహించిన 3 లక్షల 81 వేల 27 పరీక్షలతో.. మొత్తం 2 కోట్ల 2 లక్షల 2 వేల 858కి కరోనా టెస్టుల సంఖ్య చేరింది.