యంగ్ టైగర్ అని ఎందుకన్నారో కానీ, నిజంగానే ఎన్టీఆర్ టైగర్‌తో ఫైట్ చేసే సీన్ ఒకటి RRRలో ప్లాన్ చేసినట్టు వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ను సంతోష పరుస్తోంది. బల్గేరియాలో దర్శకధీర రాజమౌళి ప్రస్తుతం తారక్ ఎంట్రీ సీన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. టైగర్‌తో తలపడే ఈ సీన్ సినిమాలోనే హైలైట్ కాబోతోందని టాక్!
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సెన్సేషన్ మూవీ ఆర్.ఆర్.ఆర్.లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రేపుతోంది. ఫ్యాన్స్ అంచనాలకు అందని రీతిలో రాజమౌళి ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ప్లాన్ చేశారట.
బల్గేరియాలో జరుగుతున్న షెడ్యూల్లో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ భారీగా చిత్రీకరణ చేస్తున్నారు. బిగ్ ఫైట్‌తో పాటు రియల్ టైగర్‌తో ఎన్టీఆర్ తలపడే దృశ్యాలు తీస్తున్నట్లు తెలుస్తోంది.
కొమురం భీమ్‌గా ఎంట్రీ ఇచ్చే యుంగ్ టైగర్ ఎన్టీఆర్ రియల్ టైగర్‌తో ఫైట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్, రాజమౌళి డైరక్షన్‌లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్. బిగ్ సెన్సేషన్ కానుంది.