ఆదాయపు పన్ను రిటర్న్ చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్న విషయం తెలిసిందే. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేస్తున్నప్పుడు ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు. కేంద్ర ప్రభుత్వం (ITR) దాఖలు గడువు తేదీని డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించింది. అయితే ఐటిఆర్ ని దాఖలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోండి.
1. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీ మొత్తం చూపించాలి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వారి ఐటిఆర్ ని దాఖలు చేసేటప్పుడు పొదుపు ఖాతా డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల నుండి వారి వడ్డీ ఆదాయాన్ని చూపించాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను కింద ట్యాక్స్ కట్టాలి.
2. ఏడాది ఐటిఆర్ ని దాఖలు చేసేటప్పుడు వివిధ రకాల ఆదాయ వనరుల కోసం సరైన ఐటిఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
3. ఇ-వెరిఫికేషన్ : ఒకవేళ మీరు మీ ఐటిఆర్ ని ఫైల్ చేసి, ఇ-వెరిఫై చేయకపోతే రిటర్న్ ప్రాసెసింగ్ ప్రభావితం అవుతుంది. నెట్ బ్యాంకింగ్ ఖాతా, ఆధార్ ఓటీపీ ద్వారా ఐటిఆర్ ని ఇ-వెరిఫై చేయవచ్చు.
4. ఈ ఏడాది పన్ను చెల్లించే వారు కొత్త, పాత పన్ను విధానాల కింద ఐటిఆర్ ని దాఖలు చేయవచ్చు.
5. 2020-21 ఆర్థిక సంవత్సరం మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల నుండి సంపాదించిన మొత్తానికి డివిడెండ్ పన్ను చెల్లించాలి. ఐటిఆర్ ఫైలింగ్ సమయంలో ఆదాయాన్ని ప్రకటించాలి.
6. ఫారం 26AS అంటే ఆర్థిక సంవత్సరంలో అన్ని వివరాలతో ఒక వ్యక్తి వార్షిక పన్ను, ఆదాయం ప్రకటన. ఫారం 26A ల వివరాలతో ఒక వ్యక్తి ఐటిఆర్ వివరాలు సరిపోవాలి.