ఈ ప్రకృతిలో ఎన్నోవింతలు ఎన్నో, వైవిధ్యాలు, ఎన్నోపోరాటాలు, ఎన్నో విజయాలు, ఎన్నోవైఫల్యాలతో..ప్రతీ ప్రాణిదీ ఓ కథ. మొసలి రూపంలో ముంచుకొస్తున్న ఆపదనుండి బయటపడింది ఓ జింక.
50 సెకెన్ల నిడివి వున్న ఈ వీడియో చూస్తే జీవన పోరాటం,జీవన వైవిధ్యమే కాదు. జీవన మాధుర్యం కూడా వంటబడుతుంది. జింకను వెంటాడుతున్న మొసలి వీడియోను ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోలో జింక నది దాటుతుండగా మొసలి దాన్ని వెంబడించడం కనిపిస్తుంది. ఈ వీడియో క్లైమాక్స్ టాప్ క్లాస్ అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఈ వైరల్ వీడియోను తొలుత విస్‌ీమ్ ఆఫ్ ది లయన్ ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు.
వీడియో చివరిలో జింకకు అతిదగ్గరగా వెళ్లిన మొసలి దాన్ని దాదాపు మింగేయబోతుండగా జింక అతివేగంతో దాని బారి నుండి తప్పించుకుని క్షేమంగా ఒడ్డుకు చేరుతుంది. ఏ టాప్ క్లాస్ క్లైమాక్స్ క్యాప్షన్‌తో కాప్రి ఈ వీడియోను షేర్ చేయగా ఈ వీడియోను ఇప్పటివరకూ 18.000 మందికి పైగా వీక్షించారు.
A TOP class climax !
🥰 pic.twitter.com/17jDM9cNpY— Vinod Kapri (@vinodkapri) February 6, 2023