ఫిలింనగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వివాదం సద్దుమణగలేదు. రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ సంస్థ మాట తప్పిందంటూ భారీ ఆందోళనకు దిగారు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు. తొలగించిన చోటనే ఆలయం నిర్మాణం చేయాలి అంటూ వందలాది మంది ధర్నా నిర్వహించారు.
కొన్నాళ్ల క్రితం ఆలయాన్ని కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పీఠాధిపతులు, వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడకు వెళ్లగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పోలీస్ స్టేషన్ లోనే దీక్షకు కూర్చుకున్నారు. దీంతో దిగి వచ్చిన సదరు సంస్థ.. ఉన్నచోటనే ఆలయాన్ని నిర్మించేందుకు 2వేల గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఒప్పుకుంది. స్వామీజీలు, కార్యకర్తలతో ఒప్పందం చేసుకుంది.
అయితే.. సడెన్ గా మళ్లీ వివాదం మొదటికొచ్చింది. ఆలయం నిర్మాణంపై రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ సంస్థ మాట తప్పిందంటూ ధర్నాకు దిగారు వీహెచ్పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు.