ఐపీఎల్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీ చూస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది ఇలా వుంటే ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు పలువురు ప్రత్యేక అతిథులు రానున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. శ్రీలకం క్రికెట్ బోర్డు, ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల అధ్యక్షులు రాబోతున్నట్టు తెలిపారు.
మ్యాచ్ అనంతరం ఆసియా కప్ గురించి వారితో చర్చిస్తామని తెలిపారు. మరోవైపు ఆతిథ్య దేశంగా ఆసియా కప్‌లో హైబ్రీడ్ మోడల్ కోసం ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నామని పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ నజామ్ సేథీ గత వారం వెల్లడించారు.
వాస్తవానికి ఈ టోర్నీ పాక్ వేదికగా జరగాల్సి వుంది. ఇరు దేశాల మధ్య రాజకీయ పరిస్థితులు, భద్రతా కారణాల రీత్యా పాక్ లో తాము పర్యటించబోమని భారత జట్టు ప్రకటించింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ఫైర్ అయింది. అదే జరిగితే భారత్ లో జరగబోయే వన్డే వరల్డ్ కప్-2023లో పాక్ జట్టు పాల్గోబోదని తేల్చి చెప్పింది.
ఇక ఐపీఎల్ లో ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై జట్టు విజయం సాధించింది. మరో బెర్తు కోసం ముంబై, గుజరాత్ టైటాన్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రెండింటిలో విజయం సాధించిన జట్టు చెన్నైతో ఫైనల్ లో తలపడనుంది.