విక్టరీ వెంకటేష్-దగ్గుబాటి రానాలతో ఓ మల్టిస్టారర్ సినిమా తీయాలని నిర్మాత సురేష్ బాబు ఎప్పటి నుండో చూస్తున్నారు. సరైన కథలు దొరికితే వెంటనే ఓకే చేయాలన్న ఉద్దేశంతో ఉన్న సురేష్ బాబుకు ఫైనల్ గా కథ, దర్శకుడు దొరికినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా కథలు విన్నప్పటికీ ఫైనల్ గా శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగ్నేశ చెప్పిన కథకు సురేష్ బాబు ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది.
కథకు ప్రస్తుతం ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉండగా… వచ్చే ఏడాది వెంకీ,రానా సినిమాలన్నీ పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించున్నారు.