మహార్షి సినిమాతో మహేష్ బాబు- డైరెక్టర్ వంశీ పైడిపల్లి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆ సాన్నిహిత్యం అలాగే కొనసాగగా… సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈ ఇద్దరు కలిసి మరో సినిమా తీయనున్నారని ప్రచారం జరిగింది. దిల్ రాజు నిర్మాణ సంస్థలో సినిమా ఉంటుందని అంతా అనుకుంటున్న సమయంలో, కథ నచ్చలేదంటూ మహేష్… సర్కారు వారి పాటకు ఓకే చెప్పారు.
అయితే, తాజాగా వంశీ రెడీ చేసిన కథకు మహేష్ ఒకే చెప్పినట్లు ప్రచారం సాగుతుంది. అయితే, ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తయ్యాకే మహేష్ సినిమాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సర్కారు వారి పాట తర్వాత ఈ సినిమా ఉంటుందా…? లేక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందన్న ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ఉంటుందా అన్న క్లారిటీ రావాల్సి ఉంది. బడా నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ కలిసి ఈ మూవీని నిర్మించనున్నారు.