హైదరాబాద్ లోని సైదాబాద్ లో చిన్నారి హత్యాచారం జరిగి రోజులు గడుస్తున్నా నిందితున్ని ఇంకా పోలీసులు పట్టుకోలేదు. ప్రతిపక్షాలు, సామాజిక వేత్తలు ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి పరామర్శించరా…. బాధితుల కుటుంబానికి భరోసా ఇవ్వారా అని సభ్య సమాజం ప్రశ్నించింది.
ఇంత జరిగిన తర్వాత మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. హత్యాచార ఘటన భాదాకరమని, నిందితుడు రాజుకు కఠిన శిక్ష పడేలా చేస్తామని మీడియాకు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. సిటీలోనే ఉండి మంత్రి మల్లారెడ్డి ఇన్ని రోజులైనా ఎందుకు రాలేదని, నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు సమయం తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంత ఘోర ఘటనలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుకు సిగ్గుపడుతున్నట్లు మండిపడ్డారు.