ముంబై ఇండియన్స్ టీంలో కీలక బ్యాట్స్‌మన్‌లలో ఒకరు సూర్యకుమార్ యాదవ్. ఎంతో మంది హేమాహేమీలకు దక్కని ఛాన్స్ కూడా సూర్యకుమార్ కు ముంబై టీంలో తనకు దక్కింది. తను కూడా జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కీలక ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. కానీ భారత జట్టుకు ఆడాలన్న కల మాత్రం నెరవేరలేదు. దీంతో అసలు సూర్యకుమార్ కు అవకాశం ఇస్తారా అన్న మీమ్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి.
అయితే, ఇన్నాళ్ల సూర్యకుమార్ యాదవ్ నిరీక్షణకు తెరపడే క్షణాలు దగ్గరయ్యాయి. టీమ్‌ఇండియా తరఫున ఆడాలనే కోరిక ఇంగ్లాండ్‌తో నేడు జరగబోయే తొలి టీ20తో నిజమయ్యే అవకాశం ఉంది. గత మూడేళ్లుగా దేశవాళీ, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నా.. సూర్యకుమార్‌కు టీమ్‌ఇండియా యాజమాన్యం నుంచి పిలుపురాలేదు. కానీ ఇంగ్లాండ్ తో టీ-20 సిరీస్ కు ఎంపిక కాగా, తొలి మ్యాచ్ లో ఆడే అవకాశం పొందినట్లు తెలుస్తోంది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని బయటకు చెప్పకపోయినా.. సూర్యకుమార్ పరోక్షంగా తెలిపాడు. సాహిల్‌ఖాన్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సూర్య తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేస్తున్నాడు. అతడికి శుభాకాంక్షలు’ అంటూ పోస్టు పెట్టాడు. దానికి స్పందించిన సూర్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ పోస్టును పంచుకొని అవునని అర్థం వచ్చేలా వివరించాడు. దీంతో ఇంగ్లాండ్‌తో నేడు జరిగే తొలి టీ20లోనే ఈ ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్ బరిలోకి దిగేఅవకాశం ఉందని అర్థమవుతోంది.
ఇండియాకు ఆడాలన్న తన కల అయితే నెరవేరుతుంది… మరీ… ఎలా ఆడతాడో చూడాలి.