నాగచైతన్య, సమంత విడిపోయారనే సంగతి తెలిసిందే. అయితే వాళ్లు విడిపోయిన రోజు నుంచి ఇప్పటివరకు ఆ వ్యవహారం హాట్ టాపిక్ గా నలుగుతూనే ఉంది. తాజాగా ఇప్పుడీ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. తన సోషల్ మీడియా పేజీ నుంచి నాగచైతన్యను అన్-ఫాలో కొట్టింది సమంత.
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత మెల్లగా ఆ జ్ఞాపకాల నుంచి బయటకొస్తోంది సమంత. ముందుగా తామిద్దరం విడిపోయిన విషయాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నాగచైతన్యతో కలిసి దిగిన ఫొటోల్ని డిలీట్ చేసింది. కేవలం 2-3 ఫొటోలు మాత్రమే ఉంచింది. ఆ తర్వాత కొన్ని రోజులకు విడిపోయామంటూ పెట్టిన పోస్ట్ ను కూడా డిలీట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఇనస్టాగ్రామ్ నుంచి నాగచైతన్యను అన్ ఫాలో కొట్టింది
అటు నాగచైతన్య మాత్రం సమంతను ఇంకా ఫాలో అవుతున్నాడు. ఆమెతో గతంలో దిగిన కొన్ని ఫొటోల్ని డిలీట్ చేసినప్పటికీ, మరికొన్ని ఫొటోల్ని అలానే కొనసాగిస్తున్నాడు. ఇక అక్కినేని కుటుంబానికి చెందిన చాలామంది వ్యక్తులు సమంతను సోషల్ మీడియాలో ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.
విడిపోయినప్పటికీ తామిద్దరం మంచి స్నేహితుల్లా ఎప్పుడూ కలిసే ఉంటామని ప్రకటించుకున్నారు నాగచైతన్య-సమంత. కానీ సమంత మాత్రం ఇప్పుడిలా అన్-ఫాలో కొట్టి సంచలనం సృష్టించింది. అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయం ఇప్పటికీ ఓ బ్రహ్మ రహస్యమే. వాళ్లిద్దరికీ, మరో ఇద్దరికి తప్ప మరో వ్యక్తికి ఆ సీక్రెట్ తెలిసే అవకాశం లేదు.