కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సభకు ఆర్థిక సర్వేను సమర్పించారు. 2 భాగాల్లో ఆర్థిక సర్వే కాపీలను ప్రచురించారు. కాగా 2021-22లో జీడీపీ వృద్ధి 11 శాతంగా ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ బృందం దీన్ని రూపొందించింది. గతేడాది వివిధ రంగాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన సంస్కరణలను ఇందులో వివరించారు. ఇక కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. రేపు అఖిలపక్ష సమావేశం జరగనుంది.