గేదే వేసిన పేడ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన గ్వాలియర్ లో జరిగింది. బేతాల్ అనే వ్యక్తికి చెందిన రెండు గేదెలు మేత మేస్తూ హైవే పైకి వెళ్లాయి. అదే రోడ్డుపై కన్స్టక్షన్ జరుగుతుంది. అదే సమయంలో జిల్లా కలెక్టర్ కమీషనర్ ఆ రోడ్డును ఇన్స్ఫెక్షన్ చేయడానికి వచ్చారు.
వాహనాలకు అడ్డంగా వస్తున్న బర్లను చూసి కోపోద్రిక్తుడైన కలెక్టర్ …..బాధ్యతారహితంగా వ్యవహరించిన బర్ల యజమానికి 10 వేల రూపాయల ఫైన్ వేయాలని సూచించాడు. మొదట ఫైన్ కట్టడానికి నిరాకరించినప్పటికీ….. ఈ విషయంపై కలెక్టర్ సీరియస్ గా ఉండడంతో …..10 వేల ఫైన్ కట్టి తన గేదెలను తీసుకొని వెళ్లాడు ఆ యజమాని