ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటే అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సామాన్యుల దగ్గర సెలబ్రెటీలు వరకూ ఎరికైనా సరే జరిమానా విధిస్తున్నారు. ఇలా గతంలో రూల్స్ బ్రేక్ చేసిన సెలబ్రెటీలకు ఫైన్ వేసిన ఘటన చాలానే చూశాం. తాజాగా సినీ హీరోస్ అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు ఫైన్ వేశారు. ఇంతకి వాళ్లేం రూల్స్ బ్రేక్ చేశారు.
సినీ నటుడు అల్లు అర్జున్ కారుకు శనివారం జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న అల్లు అర్జున్ కారును ఆపి, ఆ కారుకు నల్ల ఫిల్మ్‌లు ఉండడంతో వాటిని తొలగించడంతో పాటు రూ.700 రూపాయల జరిమానా విధించారు.
ఇక అదే దారిలో వచ్చిన మరో హీరో కల్యాణ్ రామ్ కారును కూడా పోలీసులు ఆపారు. ఈ కారుకు కూడా బ్లాక్ ఫీల్మ్ ఉండటంతో దాన్నితీసేశారు. రూ.700 ఫైన్ కూడా వేశారు. ఒక్క బ్లాక్ ఫిల్మ్ విషయంలోనే కాదు.. ఇతర నిబంధనలు పాటించని మరో 80కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు.