ఫిన్లాండ్ కొత్త ప్రధాన మంత్రిగా 34 ఏళ్ల సన్న మరీన్ ఎన్నికయ్యారు. సోషల్ డెమోక్రాట్స్ పార్టీకి చెందిన ఆమె గతంలో రవాణా మంత్రిగా పనిచేశారు. ఆమె ప్రధానిగా ఎన్నికవ్వడం కంటే ఆమె వయస్సుపైనే అందరి దృష్టి పడింది. ఇంత చిన్న వయస్సుల్లో ఓ దేశ ప్రధానిగా ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తానేది చర్చానీయాంశంగా మారింది. మీడియా కూడా ఆమె వయసుపైనే ప్రశ్నలు గుప్పించింది. ” నేను నా వయస్సు, మహిళ అనే విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు…నేను ఏ కారణాల చేత రాజకీయాల్లోకి వచ్చాను…ఏ అంశాలు ఓటర్లు తనను ప్రధానిగా ఎన్నుకోవడానికి కారణమయ్యాయనే విషయాలనే ఆలోచిస్తున్నాను… ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు మనం చాలా చేయాల్సి ఉంది” అన్నారు.
ఉక్రెయిన్ కు చెందిన ఒలెక్సీ హాన్చరుక్ (35) మొన్నటి వరకు ప్రపంచంలో అతి చిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డుల్లో కెక్కగా…ఇప్పుడు ఆ రికార్డును సన్న మరిన్ (34)చెరిపేశారు.
గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ప్రధానిగా ఎన్నికైన ఆంటీ రిన్నె దేశాన్ని ఆర్ధిక కష్టాల నంచి గట్టెక్కిస్తానని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధాన మంత్రి సభలో విశ్వాసాన్ని కోల్పోయారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సన్న మరినను ప్రధానిగా ఎన్నుకున్నారు.