హైదరాబాద్ కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని ఓ స్క్రాప్ గోదాములో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోదాము నుండి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలను వ్యాప్తించడకుండా నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణహాని జరగలేదని, 4 స్క్రాప్ గోదాములు, 2 ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ షెడ్లు, అశోక్ లీల్యాండ్ గూడ్స్ వాహనం, మారుతి 800 కారు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. ఆదివారం సూర్యాపేటలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రెండు బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన రెండు బస్సుల్లో ప్రమాదవ శాత్తూ మంటలు అంటుకున్నాయి.
దీంతో రెండు బస్సులూ అగ్నికి ఆహుతి అయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న వెన్నెల బస్సులో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు.