తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయినవిల్లి మండలం ఎస్. మూలపోలం గ్రామంలో వంట చేస్తుండగా గ్యాస్ లీకవ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో, రెండు తాటాకిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.