భద్రాచలం కిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఆస్పత్రిలోని సిటీ స్కాన్ బ్లాక్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఆస్పత్రి యాజమాన్యం.
మంటలు చెలరేగడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర భయాందోళనలకు గురై, బయటకు పరుగులు తీశారు. కిమ్స్ ఆస్పత్రి నిండా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఆస్పత్రి వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
దీంతో ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు ఊపరి పీల్చుకున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, రోగులందరూ క్షేమంగా ఉన్నారని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.