బీహార్ లో ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ముజాఫరాపూర్ లో కురుకురే ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంతో 10 మంది మృత చెందారు. బాయిలర్ పేలి పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 10మృతి చెందగా చాలామందికి గాయాలైనట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకొన్న 5 అగ్ని మాపక వాహనాలు మంటలను అదుపు చేస్తున్నాయి. బాయిలర్ పేలిన శబ్దాలు 5కిలోమీటర్ల దూరం వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఓ మిల్లు, భవనం ధ్వంసమైందని ప్యాక్టరీ యాజమాన్యం తెలిపారు. మృతులను గుర్తించడానికి మరింత సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » National » బ్రేకింగ్.. భారీ పేలుడు.. 10 మంది మృతి