సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిన్నారం మండలం గడ్డ పోతారం లీ ఫార్మా లిమిటెడ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్‌లో సాల్వెంట్‌ను అన్ లోడ్ చేస్తుండగా స్పార్క్స్ వచ్చాయి.
దీంతో ఒక్క సారిగా ట్యాంక్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రొడక్షన్ బ్లాక్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాయపడిని ఇద్దరు కార్మికులను హైదరాబాద్ కు తరలించారు. సమాచారం అందుకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పరిశ్రమలో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న ఇప్పటికీ ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మంటల తీవ్రత మరింత పెరిగితే పరిశ్రమలోని రియాక్టర్ లు పెలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.