గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నవరంగ్‌పూర్‌లో ఉన్న శ్రేయ్ ఆస్పత్రి(కరోనా హాస్పిటల్)లో ఈ తెల్లవారుజామున ప్రమాదవశాత్తు భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఏకంగా నాలుగైదు బ్లాకులకు మంటలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక 8 మంది రోగులు మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. వారిని వెంటనే మరో ఆస్పత్రికి తరలించారు. ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి.
అహ్మదాబాద్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో .. ఇటీవలే శ్రేయ్ హాస్పిటల్‌ను కోవిడ్-19 ఆస్పత్రిగా మార్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.