దేశ రాజధాని ఢిల్లీలోని గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉండే ఉపహార్ థియేటర్ గురించి వినే ఉంటారు. 25 ఏళ్ల క్రితం ఈ థియేటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఎన్నో కుటుంబాలు తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే, ఆదివారం తెల్లవారుజామున 4.46 గంటలకు థియేటర్‌లో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది.
థియేటర్‌లో మూలకు పడి ఉన్న ఫర్నీచర్ కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్‌లతో మంటలను ఆర్పివేశారు. అదృష్టం కొద్దీ తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, థియేటర్‌లోని బాల్కనీ, ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు.
కాగా, 1997 జూన్ 13న మధ్యాహ్నం 3 గంటలకు ఈ థియేటర్‌లో భారీగా మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పటి దుర్ఘటనలో 59 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం వల్ల జరిగిన తొక్కిసలాటలో మరో 103 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ ఆ గాయం తాలూకు మరకలు ఇంకా చెరిగిపోలేదు.
ఈ కేసు మొన్నటి వరకు కోర్టులో నలుగుతూనే ఉంది. 2015 ఆగస్టు 19న ఢిల్లీ కోర్టు థియేటర్ యజమాని సుశీల్ అన్సాల్ సోదరులకు రూ.30 కోట్ల చొప్పున జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్‌లో తుది తీర్పు వెలువరించిన కోర్టు.. ఆధారాలను నాశనం చేశారన్న ఆరోపణలపై అన్సాల్ సోదరులకు ఏడేళ్ల జైలు శిక్ష, మరో రూ.2.25 కోట్ల జరిమానా విధించింది. తమ ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేయాలని అన్సాల్ సోదరులు సుశీల్, గోపాల్ అన్సాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
Delhi | Fire breaks out at Uphaar cinema hall, near Green Park metro station; 5 fire engines at the spot
The fire broke out in furniture lying inside the cinema hall says the Fire Department. pic.twitter.com/JBC2MSbVI4
— ANI (@ANI) April 17, 2022
Advertisements