ఐడీఏ బొల్లారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు దాటికి కంపెనీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.
ఈ పేలుడుతో కొంతమంది కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీ మొత్తం రసాయనాలతో నిండిపోయింది. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 120 మంది ఉన్నట్లు సమాచారం.
మంటల్లో కొందరు కార్మికులు చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు.